ఈనెల 8న ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెడతామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద చర్చ ఉంటుందన్నారు. ఈనెల 9, 10, 15 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ఉంటుందని... 13, 14, 16, 17, 18, 19 తేదీల్లో పద్దులపై చర్చ జరుగుతుందని తెలిపారు. 20న ద్రవ్య వినిమయ బిల్లు పెడతామని చెప్పారు. అక్బరుద్దీన్, భట్టి విక్రమార్క లఘు చర్చలు పెట్టాలని కోరారని... సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని మంత్రి వేముల చెప్పారు.
లఘు చర్చల కోసం వచ్చిన సంఖ్యను బట్టి 20వ తేదీ తర్వాత మరోసారి బీఏసీ సమావేశమై... ఎన్నిరోజులు పొడిగించాలనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్పై అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత తీర్మానం చేస్తామని... కొన్ని బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెడతామని ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి: బీఏసీ భేటీ... ఈనెల 20 వరకూ అసెంబ్లీ సమావేశాలు