ETV Bharat / state

'కూరగాయలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు' - latest news on minister thalasani srinivas yadav toured in erragadda vegetable market

కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ హెచ్చరించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​తో కలిసి ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్​ను సందర్శించారు.

minister thalasani srinivas yadav toured in erragadda vegetable market
'కూరగాయలను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు'
author img

By

Published : Mar 26, 2020, 1:05 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు సనత్​నగర్ నియోజకవర్గం పరిధిలో పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పర్యటించారు. స్థానికంగా ఉన్న పలు దుకాణాలను, సూపర్ మార్కెట్లను తనిఖీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​తో కలిసి జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్​ను సందర్శించారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అమ్మకందార్లను హెచ్చరించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు. కూరగాయల మార్కెట్​కు కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే రావాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం యూసఫ్​గూడలోని రత్నదీప్ సూపర్ మార్కెట్​ను తనిఖీ చేశారు. మార్కెట్ రేటుకు.. ఇక్కడికి రూ.15 తేడా ఉండటం వల్ల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

'కూరగాయలను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు'

ఇవీచూడండి: 'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.