హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని... అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు.
అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని జీహెచ్ఎంసీ షెల్టర్లకు తరలించాలని పేర్కొన్నారు. కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: మూసీ ఉగ్రరూపం.. ముసారాంబాగ్ వంతెనపై వరద ప్రవాహం