కరోనా తీవ్రత ఉందని కేంద్రం భావిస్తే దేశ వ్యాప్తంగా అన్నిరకాల ఎన్నికలు వాయిదా వేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రచారం చేస్తూనే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే ఆలోచన ప్రస్తుతం లేదని.. కేసులు విపరీతంగా పెరిగితే చెప్పలేమని స్పష్టం చేశారు. తెలంగాణపై మాత్రమే కాకుండా భాజపాయేతర రాష్ట్రాలపైనా కేంద్రం వివక్ష చూపుతోందని తెరాస శాసనసభా పక్ష కార్యాలయంలో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలైనా.. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అన్నారు. నాగార్జున సాగర్ ఎన్నికకు ముందు ఈసీ ప్రభుత్వాన్ని సంప్రదించిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని.. స్వయంగా ప్రధానే ప్రచారం చేస్తున్నారన్నారు. యశోద ఆసుపత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెగ్యులర్ చెకప్ మాత్రమే చేసుకున్నారని తెలిపారు.
ఇదీ చూడండి: ప్రజల ప్రాణాలు కాపాడటానికి కేసీఆర్ వెనకాడరు : మంత్రి ఈటల