పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రసాయన ద్రావణాలను పిచికారీ చేశారు. ఎంటమాలజీ విభాగం వారి సహకారంతో దోమల నివారణకై తన ఇంటి పరిసర ప్రాంతాల్లో రసాయన ద్రావణాలను చల్లారు.
దోమల నివారణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమలను నివారించేందుకు జీహెచ్ఎంసీ దోమల నివారణ విభాగాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
ఇదీచూడండి: మాజీ మంత్రి రత్నాకర్‌రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం