ETV Bharat / state

talasani: 'ఈనెల 7న జలవిహార్​లో తెరాస పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం'

తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఈ నెల7న జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. నెక్లెస్ రోడ్‌ పీవీమార్గ్‌లోని జలవిహార్​లో జరిగే విస్తృతస్థాయి సమావేశానికి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు స్థానిక మంత్రులు, స్థానిక పార్టీ ప్రజాప్రతినిధులు హాజరవుతారని మంత్రి తెలిపారు.

talasani
talasani
author img

By

Published : Sep 5, 2021, 3:49 PM IST

ఈనెల 7న హైదరాబాద్​ నెక్లెస్​రోడ్డులోని పీవీమార్గ్​ జలవిహార్​లో తెరాస హైదరాబాద్​ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. సమావేశానికి పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​తో పాటు స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు.

talasani
talasani

పార్టీని బలోపేతం చేయడానికి బస్తీ నుంచి హైదరాబాద్ వరకు కమిటీ ఎన్నికలపై చర్చిస్తామని తలసాని స్పష్టం చేశారు. తెరాసకు రాష్ట్ర వ్యాప్తంగా 60లక్షల సభ్యత్వాలు ఉన్నాయని... తెలంగాణలో తిరుగులేని శక్తిగా తెరాస ఎదిగిందన్నారు. తాడు బొంగరం లేని వాళ్లు కూడా పార్టీని, కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు.

ఈనెల 7న హైదరాబాద్​ నగర సర్వసభ్య సమావేశం జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్​ పాల్గొంటారు. స్థానిక మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటారు. పార్టీని బలోపేతం చేయడానికి, బస్తీ బూత్​ కమిటీ, డివిజన్​ కమిటీ, హైదరాబాద్​ జిల్లా కమిటీలు, అనుబంధ కమిటీలను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. పార్టీ సభ్యత్వం నమోదు ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తైంది. రాష్ట్రంలో పేద, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అవకాశాలు వచ్చాయంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్​, పార్టీ ద్వారా మాత్రమే. తాడు, బొంగరం లేనోళ్లు ఏదేదే మాట్లాడుతున్నారు. టీవీలో కనిపించడానికనిచెప్పి చట్టసభలల్లో చట్టాలను చేసే వాళ్లను మనం చూస్తున్నాం.- తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి

talasani: 'ఈనెల 7న జలవిహార్​లో తెరాస పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం'

ఇదీ చూడండి: Uttam kumar reddy on trs: 'తెరాస ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.