ETV Bharat / state

ముంపు బాధితులను ఆదుకోవడంలో ముందుంటాం: తలసాని - ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నిరాశ్రయులైన వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మాని... నష్టపోయిన వారిని ఆదుకోవాలని సూచించారు. అమీర్​పేట డివిజన్​లో బాధితులకు చెక్కులను అందజేశారు.

minister-talasani-srinivas-yadav-visits-flood-areas-in-hyderabad
ముంపు బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం: తలసాని
author img

By

Published : Oct 20, 2020, 4:42 PM IST

ముంపు బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలంగాణ పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించారని అన్నారు. అమీర్‌పేట డివిజన్‌లోని బస్తీనగర్‌, గంగుబాయి, బౌదనగర్ వరద బాధితులతో మాట్లాడి... ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున సుమారు 100 మందికి చెక్కులు పంపిణీ చేశారు.

ప్రతీ కుటుంబానికి సాయం

ఈ వరదలతో హైదరాబాద్ నగరంలో నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి చేయూత అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని తెలిపారు. నలభై ఏళ్ల చరిత్రలో హైదరాబాద్​లో బీభత్సమైన వరద వచ్చిందని... ప్రజలు చాలా నష్టపోయారని అన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. నష్టపోయిన కుటుంబాలకు కేసీఆర్ అండగా ఉండి... ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు.

'విమర్శలు వద్దు'

కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా విమర్శలు మానుకొని వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌తో పాటు స్థానిక కార్పొరేటర్ శేషుకుమారి, కలెక్టర్, ఆర్డీవో తదితరులు పాల్గొన్నారు.

ముంపు బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం: తలసాని

ఇదీ చదవండి: హైదరాబాద్‌ వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.