రానున్న వర్షాకాలంలో నేపథ్యంలో నియోజకవర్గంలోని బస్తీల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు. సనత్నగర్ నియోజకవర్గం మోండా డివిజన్ పరిధిలోని నాలా బజార్ బస్తీని మంత్రి తలసాని అధికారులతో కలిసి పరిశీలించారు. గత కొన్నేళ్లుగా వార్షాకాలంలో మురుగు నీరు ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
నాలాలోకి వరద నీళ్లు వెళ్ళాకుండా అక్రమంగా ఉన్న కట్టడాలను కూల్చివేయాలని అధికారులకు మంత్రి సూచించారు. బస్తీ వాసులు విన్నవించుకున్న ఇతర సమస్యలపై స్పందించిన మంత్రి తలసాని... వెంటనే వాటన్నింటినీ పరిష్కరించవలసిందిగా స్థానిక అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: పత్తికి అదనంగా రూ.275 పెంచండి!