ETV Bharat / state

'నవంబరు నాటికి నర్సాపూర్​ చౌరస్తా పై వంతెన రెడీ' - minsiter talsani srinivas yadav about narsapur chowrasta fly over

నవంబరు నాటికల్లా నర్సాపూర్​ చౌరస్తాలో నిర్మిస్తున్న పై వంతెన​ను అందుబాటులోకి తెస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బాలానగర్​లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి... అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

minister-talasani-srinivas-yadav-visit-balanagar
'నవంబరు నాటికి నర్సాపూర్​ చౌరస్తా ఫ్లై ఓవర్ రెడీ'
author img

By

Published : Jul 6, 2020, 1:14 PM IST

హైదరాబాద్ బాలానగర్​లోని నర్సాపూర్ చౌరాస్తాలో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నర్సాపూర్​ చౌరస్తా నిత్యం రద్దీగా ఉంటుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్య పరిష్కారం కోసమే... ఇక్కడ ఫ్లై ఓవర్​ నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. నవంబరు నాటికి పూర్తి చేసి... అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

ఫ్లై ఓవర్ నిర్మాణానికి స్థల సేకరణ సమయంలో కొందరు కోర్టును ఆశ్రయించటం... కరోనా ఆంక్షల నేపథ్యంలో కార్మికుల కొరత ఏర్పడటం వల్ల నిర్మాణం కాస్త నెమ్మదిగా కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు.

'నవంబరు నాటికి నర్సాపూర్​ చౌరస్తా ఫ్లై ఓవర్ రెడీ'

ఇవీ చూడండి: శుభవార్త: ఒక్కో రైతుకు నేరుగా రూ.1.60 లక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.