సనత్‌నగర్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి అన్ని విధాల ప్రయత్నిస్తానని.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని నెహ్రూపార్క్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని, అభివృద్ధి విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు.
అనంతరం సనత్‌నగర్ డివిజన్లోని సుభాష్‌నగర్‌లో మంత్రి తలసాని పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సుభాష్‌నగర్‌లో డ్రైనేజీ సమస్యతో పాటు విద్యుత్, తాగు నీటి సమస్యల గురించి స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
ఇదీ చూడండి: Hyderabad Rains: అవే కాలనీలు.. అదే కన్నీరు.. ఇంకేన్నాళ్లీ హైదరా'బాధలు'!