సనత్‌నగర్ నియోజకవర్గంలోని వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన 10 వేల రూపాయల ఆర్థిక సహాయం పంపిణీపై కార్పొరేటర్లు, అధికారులతో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో వరద ముంపునకు గురై నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.
దేశంలోని ఏ ప్రభుత్వం.. బాధితులకు సహాయం అందించే విషయంలో ఇంత త్వరగా స్పందించలేదని, ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించలేదని చెప్పారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెద్దమనసుతో స్పందిస్తారని తెలిపారు.
బాధిత కుటుంబాలకు సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు బేగంపేట సర్కిల్లో 60, అమీర్‌పేట సర్కిల్లో 24 మంది అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ జోన్, నార్త్ జోన్ జోన్ కమిషనర్లు ప్రావీణ్య, శ్రీనివాస్ రెడ్డి మంత్రికి వివరించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న రెండు కంపెనీలు