హైదరాబాద్ నగరంలో కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. మసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయం నుంచి గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. లాక్డౌన్ అమలు జరుగుతున్న తీరును ప్రజాప్రతినిధుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సమస్యలేమైనా ఉంటే వెంటనే స్పందించాలని సూచించారు.
ఇవీ చూడండి: కరోనా గురించి అంతుచిక్కని 5 రహస్యాలివే..