హైదరాబాద్‌లో ప్రతి ఇంటికి 20వేల లీటర్లలోపు నీటిని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, జలమండలి ఎండీ దానకిషోర్ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలులో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు.
గ్రేటర్ పరిధిలో సుమారు 10 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయని వెల్లడించారు. సుమారు 70 లక్షల మంది ఈ పథకంతో లబ్ధి పొందనున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తలసాని వివరించారు.
ఇదీ చదవండి: గ్రేటర్‌లో ఉచిత తాగునీటి పథకం రేపు ప్రారంభం!