ETV Bharat / state

'స్వచ్ఛందంగా ముందుకు రండి... రక్తదానం చేయండి'

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆస్పత్రుల్లో రక్తం కొరత ఏర్పడింది. ఆ లోటును తీర్చేందుకు రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.

minister-talasani-srinivas-yadav-launch-blood-donation-camp
'స్వచ్ఛందంగా ముందుకు రండి... రక్తదానం చేయండి'
author img

By

Published : Apr 25, 2020, 4:56 PM IST

ప్రపంచ పశు వైద్య దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. హైదరాబాద్​లోని విద్యానగర్‌ రెడ్‌క్రాస్‌ రక్తనిధి కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి తలసాని ప్రారంభించారు.

రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన పశువైద్యులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. కరోనా సంక్షోభం సమయంలో రక్తం కొరత చాలా ఉందని... ఈ క్లిష్ట పరిస్థితుల్లో రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు.

ఇవీ చూడండి: 'భాజపా మెడికల్​ పోర్టల్​ను సద్వినియోగం చేసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.