పేదలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతోనే అప్పట్లో బస్తీ దవాఖానాలు.. ఇప్పుడు రోగ నిర్ధారణ కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. హైదరాబాద్ అంబర్‌పేటలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి.. మంత్రి డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించారు.
వైద్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. అన్ని సర్కారు ఆస్పత్రులను ఆధునికీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని రోగ నిర్ధారణ కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. కరోనా నియంత్రణలో ఆరోగ్య శాఖ సిబ్బంది అద్భుతంగా పనిచేశారంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి, సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన నీతిఆయోగ్ బృందం