దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు మంత్రిని ఘనంగా సత్కరించి.. వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారికి విశేష అలంకరణలతో దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కరోనా మహమ్మారి పీడ దేశాన్ని వదిలి వెళ్లాలని వేడుకున్నారు.
తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాలలో విశేషాలంకరణలతో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. దేవీ నవరాత్రులు ప్రారంభం కావడం వల్ల ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.
ఇదీ చదవండి: నాగార్జునసాగర్ 18 క్రస్టు గేట్లు ఎత్తి నీటి విడుదల