ETV Bharat / state

పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన తలసాని - corona virus

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సూచించారు. హైదరాబాద్​ కవాడిగూడ డివిజన్​లోని ముగ్గు బస్తీలో ఎమ్మెల్యే ముఠా గోపాల్​తో కలిసి పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

minister talasani srinivas yadav groceries distribution to poor people in hyderabad
పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన మంత్రి తలసాని
author img

By

Published : Jul 18, 2020, 7:37 PM IST

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎదురయ్యే సమస్యలను సంఘటితమై ఎదుర్కోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. రాజకీయాలకు అతీతంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని మంత్రి అన్నారు. హైదరాబాద్​ కవాడిగూడ డివిజన్​లోని ముగ్గు బస్తీలో పేదలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్​ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కరోనా మహమ్మారిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. యావత్ ప్రపంచం కరోనాతో పోరాడుతున్నా.. కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న ప్రచారంపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీ నగర్ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, కార్పొరేటర్ లాస్య నందిత మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు ముఠా నరేష్, యువ నాయకులు ముఠా జైసింహా, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ రాంచందర్, తెరాస సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: టీ కన్సల్ట్ యాప్​ను ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.