రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద శనివారం.. 201 మంది కల్యాణలక్ష్మి, 48 మంది షాదీముబారక్ లబ్ధిదారులకు మంత్రి చెక్కులను పంపిణీ చేశారు.
పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తలసాని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచుల వివాహానికి ప్రభుత్వ పరంగా చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పథకాల కింద ఒక్కొక్కరికి రూ.లక్షా 116 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, హేమలత, మహేశ్వరి, సుచిత్ర, సరళ, దీపిక, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Bear : ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో జనం