పేదలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ పథకం కింద 8మందికి, షాదీముబారక్ పథకం కింద 40 మందికి చెక్కులు పంపిణీ చేశారు. వారితో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రాంగోపాల్ డివిజన్‌కు చెందిన 11 మందికి ఆరు లక్షల విలువైన చెక్కులు అందించారు.
పేద ప్రజలతో పాటు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆసరా పింఛన్లు అందిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మీ బాల్ రెడ్డి, అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.