ETV Bharat / state

పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనదే: మంత్రి తలసాని - సికింద్రాబాద్​లో మంత్రి తలసాని పర్యటన

సికింద్రాబాద్​లోని బన్సీలాల్​పేట్ డివిజన్​ పరిధిలో మంత్రి తలసాని పర్యటించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్కందగిరి ఆలయం వద్ద మొక్కలు నాటి పరిసరాలను శానిటైజర్​తో పిచికారి చేశారు.

talasani-srinivas-visit-bansilal-pet-area-in-secunderabad
పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనదే: మంత్రి తలసాని
author img

By

Published : Jun 5, 2020, 1:35 PM IST

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే కరోనా వంటి వ్యాధులు దరిచేరవని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్​లోని బన్సీలాల్​పేట్ డివిజన్​ పరిధిలోని స్కందగిరి ఆలయం వద్ద మొక్కలు నాటి పరిసరాలను సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణంతో పిచికారి చేశారు.

పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనదే: మంత్రి తలసాని

మున్సిపల్​ సిబ్బందికి పర్యావరణ పరిరక్షణకు చెత్త సేకరించే రిక్షా వాహనాలను ఆయన పంపిణీ చేసి ప్రారంభించారు. వచ్చే సీజన్​ వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటల 10నిమిషాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: ప్రభుత్వమే కొనుగోలు చేయాలి- రైతుహితమే జాతిభద్రత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.