కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. కరోనా నివారణ కోసం సర్కారు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రజలు గుంపులుగా ఉండొద్దని, వృద్ధులు, చిన్నారులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.
కొవిడ్-19 నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చర్యలు చేపట్టిందని తెలిపారు. అవసరమైతే వైద్యుల సలహాలు ,సూచనలు పాటించాలని మంత్రి తలసాని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:ఈ అపార్టుమెంట్‌లోకి కరోనా రాకుండా ఏం చేశారో తెలుసా?