బేగంపేట పరిధిలోని ఓల్డ్ కస్టమ్ బస్తీలో ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మరుగుదొడ్లు, లైట్లు, నీటి వసతి, డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు మంత్రికి విన్నవించారు.
సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాల విషయంలో లోటు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ఇదీ చూడండి : భార్య కళ్ల ముందే భర్తను చంపేశారు..