ETV Bharat / state

వరద బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి సాయం అందిస్తాం: మంత్రి తలసాని

ముంపు బాధితులకు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పేర్కొన్నారు. ఈనెల 5 నుంచి బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి.. సాయం అందించనున్నట్లు వివరించారు. ఈ మేరకు మాసబ్​ట్యాంక్​లోని తన కార్యాలయంలో సనత్​నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు.

minister talasani on Financial assistance to flood victims
వరద బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి సాయం అందిస్తాం: మంత్రి తలసాని
author img

By

Published : Nov 3, 2020, 5:31 PM IST

ఈనెల 5 నుంచి వరద ముంపు బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ పేర్కొన్నారు. మాసబ్​ట్యాంక్​లోని తన కార్యాలయంలో సనత్​నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు నామన శేషు కుమారి, అత్తిలి అరుణ గౌడ్, కొలన్ లక్ష్మి, ఆకుల రూప, కుర్మ హేమలత, ఉప్పల తరుణి, సెంట్రల్ జోన్, నార్త్ జోన్ జోనల్ కమిషనర్​లు ప్రావీణ్య, శ్రీనివాస్ రెడ్డి, డీసీలు గీతా రాధిక, ముకుందరెడ్డిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

5న అమీర్​పేట డివిజన్​లోని రేణుకానగర్, వెంకటేశ్వర టెంపుల్.. బేగంపేట డివిజన్​లోని భగవంతాపూర్, తబేలా, దేవిడి.. సనత్​నగర్ డివిజన్​లోని డీఎన్​ఎమ్​ కాలనీ, శివాజీ నగర్, చాణక్య నగర్.. రాంగోపాల్​పేట డివిజన్​లో ఓల్డ్ బోయిగూడ, కుర్మ బస్తీ, రంగ్రీజ్ బజార్.. మోండా మార్కెట్ డివిజన్​లో సాంబమూర్తి నగర్, బండిమెట్, సజ్జన్ లాల్ స్ట్రీట్.. బన్సీలాల్​పేట డివిజన్​లో సోమప్ప మఠం, నీలం బాలయ్య దొడ్డి, అరుణ్ జ్యోతి కాలనీల్లో అధికారులు బాధిత కుటుంబాల ఇళ్ల వద్దకే వెళ్లి ప్రభుత్వం సాయం రూ.10 వేలు అందజేస్తారని మంత్రి వివరించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని అన్ని బస్తీల్లో అధికారులు పర్యటించి.. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారని తెలిపారు. బాధితులు అధికారులకు సహకరించాలని కోరారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.550 కోట్ల నిధుల్లో ఇప్పటికే రూ.400 కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన బాధితులకూ ఆర్థిక సాయం అందించనున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి.. 100 శాతం పత్తి కొనుగోలుకు సీసీఐ హామీ: నిరంజన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.