ETV Bharat / state

'రాష్ట్రంలో అభివృద్ధి బాటకు బీఆర్​ఎస్​కు మరోసారి అవకాశం ఇవ్వాలి' - బీఆర్​ఎస్​ ఎన్నికల ప్రచారం 2023

Minister Talasani Meet the Press : తొమ్మిదేళ్ల సీఎం కేసీఆర్​ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందిందని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఇంతటితో ఆగిపోకుండా ప్రజలు.. బీఆర్​ఎస్​కు మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Telangana Assembly Elections 2023
Minister Talasani Meet the Press
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 3:41 PM IST

Minister Talasani Meet the Press : రాష్ట్రంపై.. కేంద్రం ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ ఆరోపించారు. కేంద్రం సాయం చేయకపోయినా కేసీఆర్(CM KCR)​ పాలనలో తెలంగాణలో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.. హైదరాబాద్​ ప్రెస్​ క్లబ్​లో.. మంత్రి తలసాని మీట్​ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు.

Minister Talasani on Double Bedroom Online Draw : ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే కేసీఆర్​ కల: తలసాని

బీఆర్​ఎస్​ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. మిగతా రాష్ట్రాలకు ఆదర్శ ప్రాయంగా మారాయన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా వ్యవసాయరంగంలోనే ఉన్నాయని.. ప్రభుత్వం వ్యవసాయానికి దన్నుగా అందిస్తున్న 24 గంటల కరెంట్​ సరఫరా.. దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ.. గిట్టుబాటు ధరను అందిస్తోందన్నారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతు కుటుంబాలకు ఆదరువుగా నిలిచామన్నారు.

Telangana Assembly Elections 2023 : ఐటీ రంగంలో హైదరాబాద్​ సాధించిన అభివృద్ధి మన కళ్లముందే కనిపిస్తోందన్నారు. భాగ్యనగర అభివృద్ధిలో కేటీఆర్​ పాత్ర మరువలేనిదన్నారు. నేడు హైదరాబాద్​ మినీ ఇండియాగా మారిందన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన ప్రజలు హైదరాబాద్​లో హాయిగా బతుకుతున్నారన్నారు. కరోనా కాలంలో వలస కార్మికులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుందన్నారు. ప్రభుత్వం నుంచి ఉచితంగా రైలు టికెట్లను అందించి వారి గమ్య స్థానాలకు చేర్చామన్నారు.

BRS Eletion Campaign 2023 : గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అనేక పథకాలు చేపట్టామని మంత్రి తలసాని స్పష్టం చేశారు. ఆడ పిల్లల పెళ్లికి ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తాన్నమన్నారు. కులవృత్తులను ప్రోత్సహించడానికి పథకాలు ప్రవేశపెట్టమన్నారు. ఒకప్పుడు వలసలకు మారుపేరుగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేడు.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సస్యశ్యామలంగా మారిందన్నారు.

ఈ ఎన్నికల తర్వాత ఇవీ కాకుండా మరో లక్ష రెండు పడకల గదుల ఇళ్లు.. హైదరాబాద్​లో నిర్మించి పేదలకు అందిస్తామని మంత్రి వెల్లడించారు. మేనిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేసిందని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ వర్షాలకు ఇబ్బందులు తలెత్తకుండా నాలాలు నిర్మించినట్లు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలకు బీఆర్​ఎస్​ బీ టీం కాదని.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఏ టీమ్ అని వెల్లడించారు. అసలు 2, 3 సీట్లు కూడా రానీ బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం హస్యాస్పదంగా ఉందన్నారు.

"బీఆర్​ఎస్​ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. అభివృద్ధికి మారుపేరైనా బీఆర్​ఎస్​కు ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వాలి. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. అయినప్పటికీ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలోపేతానికి.. అనేక పథకాలు చేపట్టాం. హైదరాబాద్​ సాధించిన అభివృద్ధి మన కళ్లముందే కనిపిస్తోంది"- తలసాని శ్రీనివాస్ యాదవ్​, మంత్రి

రాష్ట్రంలో అభివృద్ధి బాటకు బీఆర్​ఎస్​కు మరోసారి అవకాశం ఇవ్వాలి

Talasani on Mega Dairy in Raviryal : రావిర్యాల మెగా డెయిరీతో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు

Talasani Srinivas Yadav Latest Comments : 'ప్రజలు కాంగ్రెస్​ను నమ్మే పరిస్థితులు లేవు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.