రోడ్డు పక్కన జీవనం సాగిస్తున్న పేదలకు రెండు పడక గదుల ఇళ్లు అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని పొట్టి శ్రీరాములు నగర్‌లలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆయన పరిశీలించారు. నెల 26, 28 తేదీల్లో లబ్ధిదారులకు లక్కీడ్రా ద్వారా వాటిని పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా అర్హులందరికీ రెండు పడక గదుల ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా పూర్తి స్థాయిలో ఉచితంగా ఇళ్లను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఈ నెల 26న అంబేద్కర్ నగర్, 28న పొట్టి శ్రీరాములు నగర్, జులై 1న జీఐఆర్ కాంపౌండ్లో, 5న గొల్ల కొమరయ్య కాలనీలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: registrations: స్లాట్ బుకింగ్ లేకుండానే రిజిస్ట్రేషన్లు..