ఈ ఏడాది కరోనా, వరదల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. కష్టాలను మరిచిపోయి పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ను పురస్కరింంచుకుని సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్ వద్ద ఎస్పీజీ చర్చిలో క్రైస్తవులకు అందజేశారు.
కరోనా మహమ్మారి అంతం అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. పేద, మధ్య తరగతి ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కానుకలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.