రాష్ట్రంలో కులవృత్తులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas goud on excise reservations) స్పష్టం చేశారు. మద్యం దుకాణాల్లో మాదిరిగా బార్లలోనూ రిజర్వేషన్లు తెస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్(Srinivas goud on excise reservations) తెలిపారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ప్రశ్నకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమాధానం ఇచ్చారు. గౌడ కులస్తులకు మద్యం దుకాణాల కేటాయింపులో 15శాతం రిజర్వేషన్ కల్పించడం చరిత్రాత్మక నిర్ణయంగా ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ కొనియాడారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
గౌడ కులస్తులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో మద్యం దుకాణాల్లో వారికి 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా బార్లలోనూ రిజర్వేషన్లు కల్పించే యోచనలో ఉన్నాం. రిజర్వేషన్ల అమలు విధివిధానాలపై కార్యాచరణ రూపొందిస్తున్నాం.
-శ్రీనివాస్ గౌడ్, అబ్కారీ శాఖ మంత్రి
కుల వృత్తుల ఆర్థిక అభివృద్ధికి...
ఈ రిజర్వేషన్లు ఎప్పటిలోపు అమలు చేస్తారని గంగాధర్ గౌడ్ అడిగారు. రిజర్వేషన్ల అమలు విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక యూనిట్ తీసుకుంటారా... జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుంటారా అని ప్రశ్నించారు. కుల వృత్తులను గౌరవించేందుకు గౌడ కులస్తులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. గౌడ కులస్తుల్ని గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూశాయన్న శ్రీనివాస్‌గౌడ్(Srinivas goud on excise reservations).. వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పారు. బార్లలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు.. రిజర్వేషన్ల అమలు ఏవిధంగా చేయాలన్న దానిపై కసరత్తు జరుగుతోందని శ్రీనివాస్ గౌడ్ వివరించారు.
ఇదీ చదవండి: CM KCR on Field Assistants: ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకునే అంశం పరిశీలిస్తాం: కేసీఆర్