ETV Bharat / state

'భాగ్యనగరం.. విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం' - తెలంగాణలో నాటకోత్సవాలు

నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం పురస్కరించుకొని రవీంద్రభారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న నాటకోత్సవాలను మంత్రి ప్రారంభించారు.

ravindrabharathi, bhagumathi drama, fine arts
srinivas goud, drama festival, ravindrabharathi
author img

By

Published : Mar 25, 2021, 10:39 PM IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళలు, కళాకారులను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న నాటకోత్సవాలను మంత్రి ప్రారంభించారు. విభిన్న సాంస్కృతిక, సంప్రదాయాలకు భాగ్యనగరం నిలయమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. నాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఉచితంగా ప్రదర్శనలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

విద్యార్థులను, యువకులను నాటక రంగం వైపు ఆకర్షించేందుకు పాఠశాల స్థాయి నుంచే నాటక ప్రదర్శనలు ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ సంగీత నాటక అకాడమి ఛైర్మన్‌ శివకుమార్‌ తెలిపారు. నాటకోత్సవాల్లో భాగంగా తొలి రోజు భాగమతి చారిత్రక నాటకాన్ని ప్రదర్శించారు.

కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, తెలంగాణ సంగీత నాటక అకాడమి ఛైర్మన్‌ శివకుమార్‌, కేంద్ర సాహితీ అకాడమి అవార్డు గ్రహీత విజయ్‌కుమార్‌, తెలుగు విశ్వవిద్యాలయం నాటకరంగా అధ్యాపకులు కోట్ల హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాటక రంగానికి సేవలందిస్తున్న పలువురు వృద్ధ కళాకారులను మంత్రి సన్మానించారు.

ఇదీ చూడండి: ఎన్ని ఉద్యోగ ఖాళీలున్నాయో చెప్పండి: సీఎస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.