హైదరాబాద్ జిల్లా టీఎన్జీవోస్ సంఘం అధ్యక్షుడు ముజీబ్ ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో రెండు రోజుల పాటు ఉద్యోగుల క్రీడా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవీ ప్రసాద్, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డిలు కలసి ప్రారంభించారు.
ప్రతి ఉద్యోగి ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్ బాగుంటుందని మంత్రి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి దోహద పడుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఉద్యోగి నిత్యం వ్యాయమంతో పాటు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.
ఇదీ చూడండి : 13 నుంచి స్వీట్లు తింటూ పతంగులు ఎగరేద్దాం.. రండి...