హైదరాబాద్ బేగంపేటలో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2020 బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఈనెల 13 నుంచి 15 వరకు పతంగుల పండుగ నిర్వహించనున్నారు. దేశంలోని 25 రాష్ట్రాల కైట్ టీమ్‌లతో పాటు 50 దేశాల నుంచి పతంగుల బృందాలు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ పతంగుల పండుగతో పాటు సంప్రదాయ ఆటలు ఉంటాయన్నారు.
వేయి రకాల వెరైటీలతో స్వీట్లు, స్నాక్స్
అవసరమైతే ఈ వేడుకల సమయాన్ని పొడిగిస్తామని మంత్రి తెలిపారు. మూడు రోజుల పాటు వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా కార్యక్రమాలు ఉంటాయి. సుమారు 1000 రకాల భోజన వంటలు, మిఠాయిలు, స్నాక్స్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు.
సమావేశంలో రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, పర్యాటకశాఖ ఎండీ మనోహర్‌తో పాటు వివిధ ప్రభుత్వశాఖలకు సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కాలుష్యం నుంచి కాపాడే శిరస్త్రాణం