ETV Bharat / state

'పురాతన కట్టడాలకు ఆటంకం కలగకుండా చూసుకుంటాం'

గోల్కొండ కోట వద్ద గల గోల్ఫ్ కోర్టును మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ సందర్శించారు. కోర్టును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

minister-srinivas-goud-visit-golf-court
పురాతన కట్టడాలకు ఆటంకం కలగకుండా చూసుకుంటాం: శ్రీనివాస్​గౌడ్​
author img

By

Published : Aug 17, 2020, 6:59 PM IST

పురాతన కట్టడాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ పేర్కొన్నారు. గోల్కొండ కోట వద్ద ఉన్న గోల్ఫ్‌ కోర్టును ప్రపంచ స్థాయి గోల్ఫ్‌ కోర్టుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అందుకు ప్రభుత్వం అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. అధికారులతో కలిసి గోల్ఫ్ మైదానాన్ని నేడు మంత్రి సందర్శించారు.

గోల్ఫ్ కోర్టు అభివృద్ధి కోసం ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయనుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కమిటీలో ప్రభుత్వం నుంచి గోల్ఫ్ అసోసియేషన్​కు చెందిన సభ్యులు ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా గోల్ఫ్‌ కోర్టు పక్కన ఉన్న 30 ఎకరాల స్థలంపై ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అభ్యంతరం తెలపడం వల్ల ఆ స్థలాన్ని సైతం మంత్రి పరిశీలించారు. నగరంలోని పారిశ్రామికవేత్తలతో పాటు ఎందరో స్పాన్సర్స్ ముందుకు వస్తారని.. వారి సహకారంతో గోల్ఫ్​ కోర్టును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

పురాతన కట్టడాలకు ఆటంకం కలగకుండా చూసుకుంటాం: శ్రీనివాస్​గౌడ్​

ఇదీ చదవండి: కరోనా కష్టాలు: వర్షంలో సైకిల్​పై అంతిమయాత్ర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.