రాష్ట్రాన్ని క్రీడాహబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. క్రీడాకారులు దేశానికి చాలా అవసరమన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని తన ఛాంబర్‌లో 81వ నేషనల్ ఇంటర్ స్టేట్ టేబుల్ టెన్నిస్ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు టేబుల్ టెన్నిస్ ప్రతినిధులు నరసింహారెడ్డి, ప్రకాష్, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యకరంగా ఉండాలంటే... క్రీడల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దాదాపు 45 క్రీడా మైదానాలు నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారికి తగిన విధంగా ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈనెల 27 నుంచి పిబ్రవరి 2 వరకు సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించే టేబుల్ టెన్నిస్ పోటీలను అందరు ఆదరించాలని కోరారు.
ఇవీ చూడండి: దావోస్‌లో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం