విదేశాల్లోనూ పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని.. పీవీ విజ్ఞానవేదిక థీమ్ పార్కును త్వరలోనే ఏర్పాటు చేస్తామని రాజ్యసభ సభ్యులు కేశవరావు అన్నారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వస్థలం వంగర గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. పీవీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పీవీ స్వస్థలం వంగరలో త్వరలో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ఒక మంచి ప్రభుత్వాన్ని పీవీ నడిపారని ఆయన గుర్తు చేశారు.
ఇదీ చూడండి: పీవీ దేశాన్ని సమూలంగా మార్చిన తపస్వి: వెంకయ్య