ETV Bharat / state

Srinivas goud : యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలి

యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఉప్పల్ స్టేడియంలో క్రీడాకారుల కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లాల్లో యువత కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

srinivas goud, vaccination
శ్రీనివాస్ గౌడ్, వ్యాక్సినేషన్
author img

By

Published : Jun 28, 2021, 12:20 PM IST

గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కృషి చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో హెచ్​సీఏ ఆటగాళ్ల కోసం చేపట్టిన టీకా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో క్రికెట్​లో రాణించే యువతకు ఉచిత శిక్షణ కేంద్రాలను ప్రారంభించాలని హెచ్​సీఏకు మంత్రి సూచించారు. హెచ్​సీఏలో శిక్షణ పొందాలంటే గతంలో పైరవీలు చేయాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రతిభకే అవకాశాలు దక్కుతాయని అన్నారు.

అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదుతో పాటు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తోందని తెలిపారు.

ఇదీ చదవండి: WEATHER: నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.