ETV Bharat / state

Water Disputes: ఏపీ పాలకులు అన్యాయం చేస్తుంటే ఊరుకోం: శ్రీనివాస్‌ గౌడ్‌

నీటి పంపకాల విషయంలో ఏపీ పాలకులు అన్యాయం చేస్తుంటే ఊరుకోబోమని.. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ స్పష్టం చేశారు. కృష్ణానది పరివాహకంలో లేని జిల్లాలకు కృష్ణా జలాలు కావాలా? అని ప్రశ్నించారు. నది ఒడ్డున ఉన్న పాలమూరు ప్రజలకు కృష్ణా జలాలు వద్దా? అంటూ శ్రీనివాస్​గౌడ్​ నిలదీశారు.

srinivas goud
srinivas goud
author img

By

Published : Jun 21, 2021, 8:49 PM IST

Updated : Jun 21, 2021, 9:08 PM IST

తెలుగు రాష్ట్రాలు బాగుండాలని సీఎం కేసీఆర్‌ కోరుకున్నారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. ఏపీ పాలకులు మాత్రం తెలంగాణతో కయ్యానికి సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాకు కృష్ణా జలాలు తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీ పాలకులు అన్యాయం చేస్తుంటే ఊరుకోమని స్పష్టం చేశారు.

కృష్ణానది పరివాహకంలో లేని జిల్లాలకు కృష్ణా జలాలు కావాలా? అని శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించారు. నది ఒడ్డున ఉన్న పాలమూరు ప్రజలకు కృష్ణా జలాలు వద్దా? అంటూ నిలదీశారు. ట్రైబ్యునల్‌, ఎన్జీటీ ఆదేశాలను కూడా ఏపీ ప్రభుత్వం ధిక్కరిస్తోందని ఆరోపించారు. టెలీమెట్రీలను ధ్వంసం చేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీరు వాడుకుంటోందన్నారు. సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్‌లో ప్రశాంతంగా ఉన్నారన్న శ్రీనివాస్‌ గౌడ్‌.. ఐక్యంగా ఉండేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలపై.. శ్రీనివాస్​గౌడ్​ స్పందించారు.

కేంద్ర జల్​శక్తి మంత్రి వద్ద, అపెక్స్​ కౌన్సిల్​లో ఏపీ ముఖ్యమంత్రి చెప్పిదేంటి. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు విత్​డ్రా చేసుకొంటే.. బ్రిజేష్​​ కుమార్​ ట్రైబ్యునల్​ తీర్పు తొందరగా వచ్చేట్లు చేస్తామన్నారు. కేంద్ర మంత్రి వద్ద రాయలసీమ ఎత్తిపోతల ప్రారంభం చేయమని మాట ఇచ్చారా లేదా.. అని ఏపీ ముఖ్యమంత్రిని అడుగుతున్నా.. మీరు మాటమీద నిలబడతారని సుప్రీంలో కేసు విత్​డ్రా చేసుకొంటే.. ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే అది స్నేహహస్తమా.. అని అడుతున్నా.. మా జిల్లాను ఎండబెడతారంటే మేం ఊరుకోం. మా జిల్లాలు మళ్లా వలసబాటలు పట్టాలంటే మేం ఊరుకోం. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చుకున్నోళ్లం.

-శ్రీనివాస్​గౌడ్​, రాష్ట్ర మంత్రి

ఏపీ పాలకులు అన్యాయం చేస్తుంటే ఊరుకోం: శ్రీనివాస్‌ గౌడ్‌

ఏపీ మంత్రి ఏమన్నారంటే

చట్టానికి లోబడే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అనిల్‌కుమార్‌ వెల్లడించారు. కృష్ణా నది నుంచి చుక్కనీరు కూడా ఎక్కువ తీసుకోవడం లేదన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్‌ పెడితే.. తప్పెలా అవుతుందో తెలంగాణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు సామర్థ్యం పెంచుకున్నారని.. ఆర్‌డీఎస్‌ (RDS)కు సంబంధించి ఏపీకి 4 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని మంత్రి అనిల్​ తెలిపారు. ఏపీలో ఎక్కడా ప్రాజెక్టులు అక్రమంగా కట్టడం లేదన్న మంత్రి అనిల్​... తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపించారు.

ఇదీచూడండి: Anil kumar: తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు చేపడుతున్నారు

Last Updated : Jun 21, 2021, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.