ETV Bharat / state

Minister Srinivas Goud: 'ఆరోపణలు చేస్తున్నవారి భరతం పడతా' - మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అఫిడవిట్​ వార్తలు

Minister Srinivas Goud: తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారి పేర్లను త్వరలోనే బయటపెడతానని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేని వారే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Minister Srinivas Goud, మంత్రి శ్రీనివాస్​ గౌడ్​
Minister Srinivas Goud
author img

By

Published : Jan 26, 2022, 3:56 PM IST

Updated : Jan 26, 2022, 4:27 PM IST

Minister Srinivas Goud: 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు అఫిడవిట్‌లు సమర్పించినట్లు వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ఎక్సైజ్​శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్‌ వివరణ ఇచ్చారు. రాజకీయంగా ఎదుర్కోలేని వారే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలోనే తనపై కొందరు కుట్రచేశారని శ్రీనివాస్​గౌడ్​ ఆరోపించారు. తన పేరుతో ఉన్న మరో వ్యక్తితో నామినేషన్‌ వేయించారని తెలిపారు. హైకోర్టు డిస్మిస్‌ చేసిన కేసులో తనపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల నాయకులంటే ఆ ఇద్దరు నేతలకు కంటగింపుగా ఉందని ఆరోపించారు. నిజాయితీగా ఉద్యోగి స్థాయి నుంచి మంత్రి స్థాయికి వచ్చానని శ్రీనివాస్​గౌడ్​ స్పష్టం చేశారు.

'హైకోర్టు డిస్మిస్‌ చేసిన కేసులో నాపై ఆరోపణలు చేస్తారా?. కోర్టులో కేసు నడుస్తోందని అవాస్తవాలు రాశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారి పేర్లను త్వరలోనే బయటపెడతాను. ఆధారాలతో సహా బయటపెట్టి వారి భరతం పడతాం.'

- శ్రీనివాస్​గౌడ్‌, రాష్ట్ర ఎక్సైజ్​ శాఖ మంత్రి

Minister Srinivas Goud: 'ఆరోపణలు చేస్తున్నవారి భరతం పడతాం'

ఇదీచూడండి:

Last Updated : Jan 26, 2022, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.