ETV Bharat / state

ఫిబ్రవరి మొదటి వారంలో పోడు భూములకు పట్టాలు - CS Shantikumari latest news

PODU LANDS: పోడు భూములకు వచ్చే నెల మొదటి వారంలో పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఉన్నత అధికారులతో మంత్రి సత్యవతి రాఠోడ్​ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు ఫిబ్రవరిలోనే అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు ఆదేశించారు.

waste lands
waste lands
author img

By

Published : Jan 30, 2023, 10:41 PM IST

PODU LANDS: రాష్ట్రంలో ఫిబ్రవరి మొదటి వారంలో పోడు భూములకు పట్టాలు అందజేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ వెల్లడించారు. పోడు భూములకు సంబంధించి పత్రాలు జారీ చేసే అంశంపై జిల్లా కలెక్టర్లతో బీఆర్కేఆర్ భవన్ నుంచి అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోడు భూములకు ఫిబ్రవరిలో పట్టాలివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన దృష్ట్యా.. అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.

ఇప్పటికే 100 శాతం సర్వే.. గ్రామ సభల ద్వారా పూర్తి చేశామని ఆమె పేర్కొన్నారు. పోడు భూములకు సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తులు ఫారెస్ట్​రైట్స్ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీల ద్వారా పరిశీలించి లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ గత సంవత్సరం నుంచే కొనసాగుతోందని తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పోడు భూములకు పట్టాలివ్వడంతోపాటుగా అటవీ సంరక్షణకు ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత నిస్తోందని స్పష్టం చేశారు. పోడు భూములకు అధికంగా దరఖాస్తులు చేసుకున్న జిల్లాలను పరిశీలించాలని తెలిపారు.

అర్హులందరికీ పట్టాలివ్వాలన్నది ముఖ్యమంత్రి అభిలాష అని.. అందుకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి సూచించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో స్థానిక ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యులను చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో అటవీ శాఖ, రెవెన్యూ సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలన్నారు. అన్ని స్థాయిల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకొని పట్టాదారు పాసు పుస్తకాలు ప్రింటింగ్ చేసి.. ఫిబ్రవరి మొదటి వారానికల్లా సిద్ధంగా ఉంచుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.