అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో గిరిజన ఉద్యోగులు సమర్థంగా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాఠోడ్ కోరారు. రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల ఉద్యోగుల డైరీని మంత్రి హైదరాబాద్లో ఆవిష్కరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే గిరిజనులకు ప్రయోజనం కలిగే అనేక పథకాలు అమలవుతున్నాయని సత్యవతి రాఠోడ్ అన్నారు.
ఎన్నికల నినాదంగా ఉన్న తండాలను గ్రామపంచాయతీలుగా మార్చే వాగ్ధానాన్ని కేసీఆర్ అమలు చేసి చూపారని వివరించారు. గిరిజన బిడ్డలే ఇపుడు వారి ఆవాసాలను పాలించుకునే అవకాశం లభించిందని మంత్రి అన్నారు.
ఇదీ చదవండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. బాధితుడికి అండగా నిలిచిన దాతలు