ETV Bharat / state

గిరిజన గ్రామపంచాయతీల అభివృద్ధికి కృషి: మంత్రి సత్యవతి - మంత్రి సత్యవతి రాఠోడ్ వ్యాఖ్యలు

గిరిజన గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సత్యవతి రాఠోడ్ అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్​లో గిరిజన జనాభా కంటే కూడా ఎక్కువ నిధులు కేటాయించారని తెలిపారు.

Minister Satyavathi rathod talk about tribal funds in assembly sessions 2021
గిరిజన గ్రామపంచాయతీల అభివృద్ధికి కృషి: మంత్రి సత్యవతి
author img

By

Published : Mar 24, 2021, 2:50 PM IST

తండాలను గ్రామ పంచాయతీలు చేయాలన్న గిరిజనుల జీవితకాల ఆశ, ఆకాంక్షను నెరవేర్చి.. 9వేల గ్రామపంచాయతీలను 12వేలకు పెంచామని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్​ పేర్కొన్నారు. ఆ గ్రామ పంచాయతీల అభివృద్ధికి జనాభా దామాషా ప్రకారం నిధులు ఇస్తూ... 500 జనాభా కన్న తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలు, తండాలకు 5 లక్షల రూపాయలకు తగ్గకుండా నిధులు ఇస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్​ అని కొనియాడారు.

గ్రామపంచాయతీలకు వచ్చే నిధులతో పాటు.. గిరిజన ప్రత్యేక ప్రగతి నిధి కింద అదనపు నిధులిచ్చి... గిరిజన గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అసెంబ్లీలో వివరించారు. గిరిజన ఉప ప్రణాళిక, గిరిజన తండాలు, గ్రామ పంచాయతీల నిర్వహణకు నేరుగా 5శాతం నిధులు ఇస్తున్నారా? అంటూ సభ్యుడు రఘునందన్​ రావు శాసనసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సత్యవతి రాఠోడ్​ సమాధానం చెప్పారు.

గిరిజన ఉప ప్రణాళిక కింద మూడేళ్ల సమయంలో 15వేల 766 కోట్ల రూపాయలు కేటాయించారని వెల్లడించారు. 2017 నుంచి గిరిజన ప్రత్యేక ప్రగతి నిధిలో 34,815.14 కోట్ల రూపాయలు కేటాయించి మొత్తంగా 7 ఏళ్లలో 50581.78 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి వివరించారు. ఈ ఏడాది బడ్జెట్​లో గిరిజన జనాభా కంటే కూడా ఎక్కువ నిధులు కేటాయించారని చెప్పారు. గిరిజన గ్రామ పంచాయతీలను తామే పాలించుకొని అభివృద్ధి చేసుకోగలమని గిరిజన సర్పంచ్​లు నిరూపిస్తున్నారని తెలిపారు.

ఇదీ చూడండి: నగర పాలికల్లోనూ బస్తీ దవాఖానాలు: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.