దేశంలో ఏ రాష్ట్రంలో అమలుచేయని విధంగా తెలంగాణలో ఆరోగ్య లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి సత్యవతి రాఠోడ్ అసెంబ్లీలో పేర్కొన్నారు. అంగన్వాడీలో ఇప్పటికే 12 వేల భవనాలు ఉన్నాయని చెప్పారు. ఈ సంవత్సరం మరికొన్ని భనవాలను నిర్మిస్తామని ప్రకటించారు. ఆ భవనాల నిర్మాణం కోసం ఎన్ఆర్జీఎస్ 5 లక్షలు, కేంద్రం లక్ష, రాష్ట్రం ఇచ్చే 2 లక్షలతో నిర్మించనున్నట్లు తెలిపారు.
అంగన్వాడీలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టామని అన్నారు. పౌల్ట్రీ రైతుల నుంచి నేరుగా మక్కలు కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పించామని వెల్లడించారు. గుడ్ల పంపిణీ విషయంలో అవకతవకలపై ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నామని వివరించారు.
ఇదీ చూడండి : వాణిజ్య పన్నుల శాఖ పునర్ వ్యవస్థీకరణపై కసరత్తు