ETV Bharat / state

గురుకులాల్లో వసతుల కల్పనపై మంత్రి సత్యవతి రాఠోడ్​ సమీక్ష - గురుకులాల్లో వసతుల కల్పనపై సత్యవతి రాఠోడ్​ సమీక్ష

హైకోర్టు గ్రీన్​సిగ్నల్ నేపథ్యంలో గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష పద్ధతిలో పునఃప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేయాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులకు సూచించారు (satyavathi rathod review on gurukulas reopen). హైదరాబాద్ దామోదర సంజీవయ్య భవన్‌లో గిరిజన విద్యాసంస్థల పునఃప్రారంభంపై గిరిజన శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు.

satyavathi rathod
satyavathi rathod
author img

By

Published : Oct 21, 2021, 9:01 PM IST

రాష్ట్రంలో గురుకులాల్లో ప్రత్యక్ష బోధనకు హైకోర్టు అనుమతి తెలిపిన నేపథ్యంలో.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సత్యవతి రాఠోడ్​ (minister satyavathi rathod) అధికారులకు సూచించారు (satyavathi rathod review on gurukulas reopen). కొవిడ్ వల్ల పాఠశాలలు మూతపడడంతో చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడిన విషయం మంత్రి ప్రస్తావించారు. గురుకులాల్లో చేరడానికి చాలా గిరాకీ ఉన్న దృష్ట్యా విద్యా సంస్థలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులందరినీ చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని సూచించారు (Minister Satyavathi Rathod review on accommodation arrangements in Gurukul).

విద్యార్థులను పాఠాశాలకు రప్పించే బాధ్యత వారిదే..

గిరిదర్శిని కార్యక్రమంలో భాగంగా గిరిజన తండాలు, గూడెంలలో ప్రతి ఇంటికీ వెళ్లి విద్యార్థుల నమోదు చేపట్టాలన్నారు. ఏ ఒక్కరు పాఠశాలలో చేరకుండా ఉండొద్దని చెప్పారు. తల్లిదండ్రులు, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి పాఠశాలలకు వచ్చే విధంగా చూడాలన్నారు. గిరిదర్శిని (giridarshini) కార్యక్రమంలో ఉపాధ్యాయులు చురుగ్గా పాల్గొని విద్యార్థుల భవిష్యత్ ​కోసం అంకితభావంతో కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో ఐసీడీఎస్‌ ఉద్యోగుల సేవలు ఇందుకోసం వినియోగించుకోవడంతో పాటు ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా అంగన్వాడీ కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. కరోనా వల్ల మూతపడ్డ విద్యా సంస్థల్లో నెల రోజులుగా పారిశుద్ధ్య పనులు జరుగుతున్నందున ఇంకా ఏమైనా ఇబ్బందులుంటే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు (satyavathi rathod review on gurukulas reopen).

వసతులు కల్పించండి..

విద్యా సంస్థల్లో తాగు నీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి కనీస వసతులు (Minimum facilities ) కల్పించి అన్ని మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని... ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లకు 20 వేల రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు. ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాల కొరత లేకుండా గిరిజన సహకార సంస్థ - జీసీసీ ద్వారా సమన్వయం చేయాలన్నారు. విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, అత్యవసర సేవల కోసం 24 గంటలపాటు నడిచేలా హెల్త్ కమాండ్ సెంటర్ ఏర్పాటు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు కావల్సిన పాఠ్య పుస్తకాలన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి సత్యవతి పేర్కొన్నారు (satyavathi rathod review on gurukulas reopen). ఈ కార్యక్రమంలో గిరిజన గురుకులాల కార్యదర్శి రోనాల్డ్‌రాస్, ఉన్నతాధికారులు సర్వేశ్వర్‌రెడ్డి, నవీన్ నికోలస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Gurukulas Reopened : నేటి నుంచి గురుకులాలు.. కార్యాచరణ ప్రకటించిన సొసైటీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.