ETV Bharat / state

'కొవిడ్​ బారిన పడిన చిన్నారుల కోసం ప్రత్యేక వసతి' - మంత్రి సత్యవతి రాఠోడ్​ తాజా వార్తలు

కొవిడ్ బారిన పడిన చిన్నారుల చికిత్స కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఐసోలేషన్​ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. హైదరాబాద్​లోని శిశువిహార్​లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్​ ప్రారంభించారు.

హైదరాబాద్​ వార్తలు
శిశువిహార్​ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
author img

By

Published : May 6, 2021, 5:18 PM IST

కొవిడ్​ బారిన పడిన చిన్నారుల చికిత్సకు ఎలాంటి లోటు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సత్యవతి రాఠోడ్​ తెలిపారు. హైదరాబాద్​లోని శిశువిహార్​లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కొవిడ్​ పాజిటివ్​ వచ్చిన పిల్లలకు మెరుగైన చికిత్స అందించేందుకు సమీపంలోని ఆస్పత్రులు, శిశుకేంద్రాలకు తరలించాలని సూచించారు. అందుకోసం అన్ని జిల్లాల్లోను ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

చిన్నారుల సంరక్షణ కోసం ఇటీవల ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్​లైన్ ​డెస్క్​కు వెళ్లి సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. పిల్లలకు మెడికల్ కిట్ అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు ఆదేశించారు. శిశు విహార్​లోని ప్రతి వార్డులో తిరిగి పరిస్థితులను సమీక్షించారు. చిన్నారులకు అందిస్తున్న ఆహారం, స్టాక్​రూంలను పరిశీలించారు.

ఇదీ చూడండి: ఐసోలేషన్‌ కేంద్రంలో 11 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.