ETV Bharat / state

'గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన' - గిరిజనులు, ఆదావాసీల పథకాలపై మంత్రి సత్యవతి రాఠోడ్

గిరిజనులు, ఆదివాసీలు ఆత్మగౌరవంతో నిలబడేలా సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. వారి అభివృద్ధి కోసం ఆయన అన్ని విధాల పాటుపడుతున్నారని పేర్కొన్నారు. మంత్రి పదవి చేపట్టాక హైదరాబాద్​లో ఆమె రెండో పుట్టిన రోజు వేడుకలు కుటుంబ సభ్యులు, అభిమానులు, అధికారులు, పార్టీ నేతల మధ్య ఘనంగా జరిగాయి.

minister satyavathi rathod about cm kcr trs government in hyderabad
'గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ పాలన'
author img

By

Published : Nov 1, 2020, 7:24 AM IST

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర గిరిజనుల సంక్షేమం, భద్రత, అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. గిరిజనుల సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఆసియాలోనే అతిపెద్ద జాతరగా మేడారాన్ని రూ.వంద కోట్లతో నిర్వహిస్తున్నారని... జోడెఘాట్​లో రూ.50కోట్లతో మ్యూజియం ఏర్పాటు చేశారని తెలిపారు. నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె రెండో జన్మదిన వేడుకలు హైదరాబాద్​లో కుటుంబ సభ్యులు, అభిమానులు, అధికారులు, పార్టీ నేతల మధ్య ఘనంగా జరిగాయి. గిరిజన సంక్షేమం, సంస్కృతి ప్రగతి నివేదిక లఘు చిత్రాన్ని మంత్రి విడుదల చేశారు.

పారిశ్రామికవేత్తలుగా...

హైదరాబాద్ బంజారాహిల్స్​లో రూ.వంద కోట్లకు పైగల భూమిలో రూ.50కోట్లతో బంజారా భవన్, కుమురం భీం భవన్​లు... వారి ఆత్మగౌరవ ప్రతీకలుగా నిర్మిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. గిరిజనుల సంస్కృతిని కాపాడడంతో పాటు వారి సమగ్ర వికాసమే ధ్యేయంగా... వారిని పారిశ్రామికవేత్తలుగా చేసే లక్ష్యంతో ఎంటర్​ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం అమలు చేస్తున్నారని తెలిపారు. ఐఎస్బీ వంటి ప్రతిష్ఠాత్మక బిజినెస్ స్కూల్​లో శిక్షణ ఇప్పించి, డీపీఆర్​లు రూపొందించి... ఎసీబీఐ ద్వారా రుణాలు ఇప్పించి అనేక ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందం కుదిర్చి పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నారని వివరించారు.

ఆత్మగౌరవం నిలబడేలా...

ఓనర్ కమ్ డ్రైవర్ పథకం ద్వారా గిరిజనులు, ఆదివాసీలను ఓనర్లుగా మార్చి స్వయం ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర గిరిజనులు, ఆదివాసీల ఆత్మగౌరవం నిలబడేలా... అభివృద్ధి బాటలో పయనించేలా వారి ప్రగతి కోసం అన్ని విధాల పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్​కు మంత్రి సత్యవతి రాఠోడ్ ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదీ చదవండి: 'జల్​ జంగల్ జమీన్ నినాదానికి మేము నోచుకోలేదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.