హైదరాబాద్ నాంపల్లిలోని నీలోఫర్ ఆస్పత్రిలో శిశు విహార్(Shishu vihar ward in Niloufer Hospital) పిల్లల కోసం ప్రత్యేక వార్డు అందుబాటులోకి వచ్చింది. స్త్రీ, శిశు సంక్షేమ, అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.17.50 లక్షలతో శిశు విహార్ ప్రత్యేక వార్డును నిర్మించారు. ఈ వార్డులో వంటగది, 10 పడకలు, ఆట స్థలంతో పాటు.... పిల్లలకు మరిన్ని సౌకర్యాలు కల్పించారు. శిశు విహార్ ప్రత్యేక వార్డును గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్(minister satyavathi rathode) ప్రారంభించారు.
వైద్యోరోగ్య శాఖకు పెద్దపీట
శిశు విహార్ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలోఫర్ ఆస్పత్రిలో వార్డు(Shishu vihar ward in Niloufer Hospital)ను ప్రారంభించామని మంత్రి సత్యవతి(minister satyavathi rathode) తెలిపారు. వైద్యారోగ్య శాఖకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని వెల్లడించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి... నగరం నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నారని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. వైద్యారోగ్య శాఖ బలోపేతం కోసం రూ.10 వేల కోట్లను ఖర్చు పెట్టనున్నారని మంత్రి వివరించారు. ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని... అందులో భాగంగా కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నారని మంత్రి అన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నందుకు గిరిజన బిడ్డగా గర్వపడుతున్నానని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
"ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు విహార్ పిల్లల కోసం నీలోఫర్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు నిర్మించడం ఆనందంగా ఉంది. ఇందుకోసం సహకరించిన శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శికి ధన్యవాదాలు. ఆస్పత్రి వాతావరణం కనిపించకుండా సకల హంగులతో వార్డు నిర్మించారు. సీఎం కేసీఆర్ వైద్యారోగ్య శాఖకు పెద్ద పీట వేస్తున్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం. "
-సత్యవతి రాఠోడ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి
అంకితభావంతో పనిచేయాలి
కొవిడ్(covid pandemic) కష్ట కాలంలో ముందుండి వైద్య సేవలు అందించిన డాక్టర్లు, సిబ్బంది.. కుటుంబాలకు దూరంగా ఉన్నారని మంత్రి సత్యవతి(Shishu vihar ward in Niloufer Hospital) కొనియాడారు. ప్రాణాలకు పణంగా పెట్టి కొవిడ్ బాధితులకు చికిత్స అందించారని.. ఇదే అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం విశేషంగా కృషిచేస్తున్నారని.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమశాఖ స్పెషల్ సెక్రటరీ దివ్య దేవరాజన్, స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Telangana Health department : వైద్యారోగ్య శాఖలో పైరవీల రాజ్యం.. నచ్చినచోటే విధులకు వెళ్తున్న యంత్రాంగం