ETV Bharat / state

'బంజారా భవన్​, కుమురం భీం భవన్​లు 15 లోపు సిద్ధం కావాలి' - మంత్రి సత్యవతి రాథోడ్​ వార్తలు

హైదరాబాద్​ నగరంలో బంజారాభవన్​, ఆదివాసీ భవన్​ల నిర్మాణ పనులను మంత్రి సత్యవతి రాఠోడ్​ సమీక్షించారు. బంజారాలు, ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా సీఎం కేసీఆర్​ వీటిని నిర్మిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

banjara bhabvan, kumuram bheem bhavan, minister sathyavathi rathode
బంజారా, కుమురం భీం భవనాలు, మంత్రి సత్యవతి రాఠోడ్​
author img

By

Published : May 7, 2021, 11:04 AM IST

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బంజారాభవన్, కుమురం భీం భవన్‌లను ఈ నెల 15లోపు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని.. అధికారులను గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆదేశించారు. బంజారాలు, ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా రూ.40 కోట్ల వ్యయంతో సీఎం కేసీఆర్ వీటిని నిర్మిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ చీఫ్‌ ఇంజినీర్ శంకర్​తో పాటు, ఇతర ఇంజినీరింగ్ అధికారులతో ఈ రెండు భవనాలపై మంత్రి సమీక్షించారు.

దాదాపుగా భవనాల నిర్మాణం పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు. బంజారా భవన్, ఆదివాసీ భవన్‌లను సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్మాణ పనులు ఉండాలని మంత్రి సూచించారు.

ఇదీ చదవండి: రైల్వే శాఖ కొవిడ్‌ నిబంధనలివే.. ఉల్లంఘిస్తే జరిమానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.