Sabitha Indrareddy on SSC Exams : రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం ప్రకంపనలు రేపుతున్న వేళ... పదో తరగతి పరీక్షల పేపర్లు బయటికి వచ్చిన ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న జరిగిన తెలుగు పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం పరీక్ష ప్రారంభమైన కొన్ని క్షణాలకు వాట్సప్‌లో ప్రత్యక్షం కాగా.... తాజాగా ఇవాళ జరిగిన హిందీ పరీక్ష ప్రశ్నాపత్రం సైతం వరంగల్‌లో పరీక్షా సమయానికే బయటికి రావటం చర్చనీయంగా మారింది. తాజా ఘటనలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం... విచారణ కోసం అధికారులను రంగంలోకి దించింది
అధికారులు, ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలి : ఇవాళ పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో వైరల్ అవడాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంపై ఆరా తీసిన మంత్రి సబిత.. వరంగల్, హనుమకొండ డీఈవోలతో ఇప్పటికే మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రెండు రోజులు వరుసగా తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలు బయటకు రావడంపై సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. నిర్వహణలో వ్యవహరించాల్సిన తీరుపై వివిధ శాఖల అధికారులకు ట్విటర్ వేదికగా పలు సూచనలు చేశారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలని సూచించారు.
- — SabithaReddy (@SabithaindraTRS) April 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— SabithaReddy (@SabithaindraTRS) April 4, 2023
">— SabithaReddy (@SabithaindraTRS) April 4, 2023
విద్యార్థులను గందరగోళానికి గురి చేయొద్దు : రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల విషయంలో జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ఆయా పాఠశాలల యాజమాన్యాలు, పోస్టల్, పోలీసు విభాగాలు, వైద్యారోగ్యశాఖ, టీఎస్ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. 4.95 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా పనిచేద్దామని ఆమె ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. మొదటిసారి పదోతరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులను గందరగోళానికి గురి చేయొద్దన్నారు. ఎవరైనా గందరగోళం సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజకీయ స్వార్థం, వ్యక్తిగత స్వార్థం వీడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.
పది పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష : మరోవైపు వరుసగా రెండోరోజు పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రశ్నపత్రాలు బయటకు రావడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలతో ఇవాళ సాయంత్రం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎస్, డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొననున్నారు.
ఇవీ చదవండి: