ETV Bharat / state

పది ఫలితాల్లో ప్రైవేట్​తో పోటీ పడాలి: సబితా ఇంద్రారెడ్డి - మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష

రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులు ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడి శభాష్​ అనిపించుకొనే విధంగా.. నాణ్యమైన విద్యను  అందించడమే  ప్రభుత్వ  లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యాధికారులతో ఆమె సమీక్షించారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ఏటా 10 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.

నాణ్యమైన విద్యకోసం ఏటా 10 వేల కోట్లు: సబితా ఇంద్రారెడ్డి
author img

By

Published : Nov 21, 2019, 8:01 PM IST

నాణ్యమైన విద్యకోసం ఏటా 10 వేల కోట్లు: సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్​లో జిల్లా విద్యాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. రానున్న పదో తరగతి పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించేలా అధికారులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు విశ్వాసాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఉందన్నారు.

పాఠశాలల్లో అదనపు గదులు, మరుగుదొడ్లు, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధులను కేటాయించేందుకు, ప్రాధాన్యతా పరంగా ప్రతిపాదనలను రూపొందించాలని డీఈఓలను మంత్రి ఆదేశించారు.

నాణ్యమైన విద్యను అందించేందుకు ఏటా విద్యాశాఖ నుంచి 10 వేల కోట్లు, ఇతర సంక్షేమ శాఖల నుంచి 8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న మంత్రి.. విద్యారంగం అభివృద్ధి కోసం ఇంతగా ఖర్చు పెడుతున్న రాష్ట్రం దేశంలో మరోటి లేదన్నారు.

ప్రజా ప్రతినిధులను భాగస్వామలు చేయాలి..

త్వరలోనే విద్యా కమిటీ ఎన్నికలు జరగనున్నాయన్న సబితా ఇంద్రారెడ్డి... విద్యా కమిటీలు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేస్తే పాఠశాల విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే కాకుండా విద్యా ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. పరీక్షల్లో విజయం సాధించేందుకు, ఒత్తిడిని తట్టుకునేందుకు అవసరమైన మెలుకువలను విద్యార్థులకు అందించేందుకు పాఠశాల స్థాయిలో కౌన్సిలర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఇవీ చూడండి: హెచ్‌ఎండీఏపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

TG_HYD_53_21_SABITHA_REVIEW_Ab_3064645 reporter: Nageshwara Chary ( ) తెలంగాణలో చదువుతున్న విద్యార్థులు ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడి శబాష్ అనిపించుకొనే విధంగా.. నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తమ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని ప్రతీ తల్లి, తండ్రి కోరుకుంటారని.., వారి ఆకాంక్షలను నిజం చేయాల్సిన బాధ్యత విద్యా శాఖ అధికారులందరిపై ఉందని మంత్రి తెలిపారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను గాడిన పెట్టి.. దేశంలో తెలంగాణ విద్యను అగ్రగామిగా చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జిల్లా విద్యాధికారులతో హైదరాబాద్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రైవేట్ పాఠశాలల కన్నా ఉన్నతమైన, నాణ్యమైన విద్యను అందించేందుకు అనేక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ఏటా విద్యాశాఖ నుంచి 10 వేల కోట్లు, ఇతర సంక్షేమ శాఖల నుంచి 8 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామన్న మంత్రి.. విద్యారంగం అభివృద్ధి కోసం ఇంతగా ఖర్చు పెడుతున్న రాష్ట్రం దేశంలో మరోటి లేదన్నారు. త్వరలోనే విద్యా కమిటీ ఎన్నికలు జరగనున్నాయన్న సబితా ఇంద్రారెడ్డి... విద్యా కమిటీలు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేస్తే పాఠశాల విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే కాకుండా విద్యా ప్రమాణాలు మెరుగవుతాయని అన్నారు. పరీక్షల్లో విజయం సాధించేందుకు, ఒత్తిడిని తట్టుకునేందుకు అవసరమైన మెలుకువలను విద్యార్థులకు అందించేందుకు పాఠశాల స్థాయిలో కౌన్సెలర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థుల పరీక్షా ఫలితాలను మెరుగుపరిచేందుకు వీరి నియామకం దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం ఎందుకు తగ్గుతుందో పరిశీలించాలని.. అవసరమైతే గైర్హజరవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఉపాధ్యాయులు మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచితే , ఉత్తమ ఫలితాలు వస్తాయని మంత్రి తెలిపారు. రానున్న పదవ తరగతి పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించేలా అధికారులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు విశ్వాసాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదులు, మరుగుదొడ్లు, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధులను కేటాయించేందుకు, ప్రాధాన్యతా పరంగా ప్రతిపాదనలను రూపొందించాలని డీఈఓలను మంత్రి0 ఆదేశించారు. విద్యార్థులను స్వచ్ఛ కమిటీలో భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. విద్యా క్యాలెండర్‌కు అనుగుణంగా సిలబస్ ను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ టి. విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. బైట్ సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.