ROJA MEETS CM JAGAN: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నగరి వర్గపోరు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. నగరిలో జరిగిన రాజకీయ పరిణామాలు, చక్రపాణిరెడ్డి అసమ్మతి వర్గం తీరుపై సీఎంకు పర్యాటక శాఖ మంత్రి రోజా ఫిర్యాదు చేసింది. తమ వర్గాన్ని పక్కనపెట్టి చక్రపాణిరెడ్డి వర్గం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ నెల 16న ఆర్‌బీకేలు, వెల్‌నెస్ కేంద్రాలను చక్రపాణిరెడ్డి వర్గ నాయకులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి వర్గం వ్యవహారంపై మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. తనను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
అసలేం జరిగింది.. నిండ్ర మండలం కొప్పెడులో ఆర్‌బీకే, వెల్‌నెస్ కేంద్రానికి.. మంత్రి రోజాని ఆహ్వానించకుండానే, చక్రపాణి రెడ్డి, కేజే శాంతి భూమి పూజ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన మంత్రి రోజా.. పార్టీలో ఉంటూ తనను నిత్యం వేధిస్తున్నారని ఇలాగైతే పార్టీలో ఉండడం కష్టమంటూ ఆడియోని విడుదల చేశారు. జనసేన పార్టీ నవ్వుకునే విధంగా పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని.. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలు ఇప్పటికైనా వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ఇలా సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: