Ghantasala Jayanthi Celebration in AP: తెలుగు నేల ఉన్నంత వరకు ఘంటసాల పాట నిలిచి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాలలో ఘంటసాల జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణుతో పాటు సాంస్కృతికశాఖ అధికారులు, సంగీత అభిమానులు పాల్గొన్నారు.
"ఘంటసాల కృష్ణా జిల్లా వాసి కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని నిలిచారనడానికి ఘంటసాల జీవితం ఓ నిదర్శనం. తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు కఠోరంగా శ్రమించి విజయం సాధించారు. ఘంటసాల కేవలం గాయకుడే కాదు.. స్వతంత్ర పోరాట యోధుడు. మహాత్మాగాంధీ ప్రభావం ఘంటసాలపై పడటం వలనే ఆయన ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించేందుకు.. తన పాటల ద్వారా ప్రయత్నం చేశారు. 18 నెలలు జైలుకు వెళ్లినా.. తన లక్ష్యం నుంచి ఘంటశాల వెనకడుగు వేయలేదు. ఘంటసాలకు భారతరత్న ఇచ్చే విధంగా మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలి." -ఆర్‌కే రోజా, ఏపీ పర్యాటక శాఖ మంత్రి
ఇవీ చదవండి: