ETV Bharat / state

Puvvada On Revanth: 'నిరూపించకపోతే రేవంత్‌ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి' - రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ

Puvvada On Revanth: మెడికల్ పీజీ సీట్లు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరమే లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రేవంత్‌రెడ్డి ఆరోపణలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. గవర్నర్‌కు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేయడాన్ని మంత్రి ఖండించారు.

Puvvada On Revanth reddy
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
author img

By

Published : Apr 23, 2022, 10:37 PM IST

Puvvada Ajay On Revanth reddy: పీజీ వైద్య సీట్లు బ్లాక్ చేసినట్లు రేవంత్ రెడ్డి నిరూపిస్తే తన కాలేజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. ఒకవేళ నిరూపించకపోతే రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తన ఆరోపణలను వెనక్కి తీసుకోక పోతే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. గవర్నర్‌కు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేయడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు.

పీజీ సీట్లు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరమే లేదు. రేవంత్‌రెడ్డి ఆరోపణలో ఏ మాత్రం నిజం లేదు. తప్పుడు ఆరోపణలతో బట్టకాల్చి మీదేస్తే సహించేది లేదు. ఒక్క సీటు బ్లాక్‌ చేసినట్లు నిరూపిస్తే ప్రభుత్వానికి సరెండర్ చేస్తా. నిరూపించకపోతే రేవంత్‌ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. ఆరోపణలను వెనక్కి తీసుకోకపోతే రేవంత్‌పై చట్టపరమైన చర్యలు. మెడికల్‌ కాలేజీ ప్రతిష్ఠను మంటగలిపే చర్యలను తిప్పికొడతాం. - పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి

పీజీ వైద్య సీట్లు బ్లాక్ చేస్తున్నామంటూ తనపై రేవంత్ రెడ్డి గవర్నర్​కు తప్పుడు ఫిర్యాదు చేశారని పువ్వాడ అజయ్ మండిపడ్డారు. ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో 20 ఏళ్లుగా పీజీ ప్రవేశాలు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. యూనివర్సిటీలో పీజీ ప్రవేశాల కౌన్సిలింగ్ సమయంలోనే తమ కాలేజీలో సీట్లన్నీ నిండిపోతాయన్నారు. అలాంటప్పుడు సీట్లు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరమే తమకు లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని.. అవన్నీ పూర్తి అవాస్తవమన్నారు. తప్పుడు ఆరోపణలతో బట్టకాల్చి మీదేస్తే సహించేది లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న తమ కాలేజీ ప్రతిష్టను మంటగలిపేందుకు యత్నిస్తే తిప్పికొడతామని మంత్రి పువ్వాడ అజయ్ హెచ్చరించారు.

ఇవీ చూడండి: కష్టాల్లో ఉన్నవారంతా నా సొంతవాళ్లే.. నేనెవరికీ దత్తతగా వెళ్లను: పవన్‌

స్విగ్గీ బ్యాగ్​లో గంజాయి.. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్​..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.